Sverige

స్వీడన్ ఉత్తర యూరప్‌కు చెందిన ఒక దేశము. స్కాండినేవియా ద్వీపకల్పానికి చెందిన ఒక నార్డిక్ కౌంటీ. 1995 జనవరి 1 నుంచి యూరోపియన్ యూనియన్ లో భాగమైంది. దీని రాజధాని నగరం స్టాక్ హోం.దేశ ఉత్తర మరయి పశ్చిమ సరిహద్దులలో నా…
స్వీడన్ ఉత్తర యూరప్‌కు చెందిన ఒక దేశము. స్కాండినేవియా ద్వీపకల్పానికి చెందిన ఒక నార్డిక్ కౌంటీ. 1995 జనవరి 1 నుంచి యూరోపియన్ యూనియన్ లో భాగమైంది. దీని రాజధాని నగరం స్టాక్ హోం.దేశ ఉత్తర మరయి పశ్చిమ సరిహద్దులలో నార్వే, తూర్పు సరిహద్దులో ఫిన్‌లాండ్,ఆగ్నేయ సరిహద్దులో డెన్మార్క్ ఉన్నాయి.దీని వైశాల్యం 449,964 చ.కి.మీ. స్వీడన్ వైశాల్యపరంగా చూస్తే యూరప్ లో ఐదవ, పశ్చిమ యూరప్లో మూడవ అతి పెద్ద దేశం. అయితే ఇక్కడ మెట్రోపాలిటన్ నగరాలను మినహాయిస్తే మిగతా ప్రాంతాలలో జన సాంద్రత చ.కి.మీకు 20 మాత్రమే. 84% శాతం మంది నగరాలలోనే నివసిస్తారు. నగరాల మొత్తం వైశాల్యం దేశ వైశాల్యంలో 1.3% మాత్రమే.జనసంఖ్య 10 మిలియన్లు. ఇక్కడి ప్రజల జీవన ప్రమాణాలు చాలా మెరుగ్గా ఉంటాయి. ఇది చాలా ఆధునికమైన, స్వేచ్ఛాయుతమైన దేశం. పర్యావరణ సంరక్షణ, వాతావరణ సమతౌల్యాన్ని పాటించడానికి ప్రభుత్వం ఇచ్చే ప్రాధాన్యతను అక్కడి ప్రజలు మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తారు. దేశంలో 2.3 మిలియన్ల ప్రజలు విదేశీ నేపథ్యం కలిగి ఉన్నారు. జనసాంధ్రత చ.కి.మీ 22. ప్రజలు అధికంగా దక్షిణ భూభాగంలో అధికంగా ఉన్నారు.ఇక్కడ దాదాపు దేశంలో సగం మంది ప్రజలు నివసిస్తున్నారు.నగరప్రాంతాలలో దాదాపు 85% ప్రజలు నివసిస్తున్నారు.
దీనిలోని డేటా: te.wikipedia.org